రెండు బృందాల సమన్వయంతో నాలుగు పనులు!

రెండు బృందాల సమన్వయంతో నాలుగు పనులు!

పులుగుర్త ఆపరేటర్స్ ని జనగామ ఆపరేటర్స్ కి పరిచయం చేశాము. పులుగుర్త ఆపరేటర్స్ తో ప్రతి మెషీన్ వీలైనంత ఎక్కువ రన్నింగ్ చేయాలి అనుకున్నాము. పులుగుర్త నుండి వచ్చిన వాళ్ళను (వీరవేణి, వెంకట లక్ష్మి, సత్యవేణి)..
వీరవేణి - కార్డింగ్, డ్రా ఫ్రేమ్
వెంకట లక్ష్మి - సింప్లెక్స్
సత్యవేణి - రింగ్ ఫ్రేమ్ చూసుకోమన్నాము.

భువన గారికి కార్డింగ్ ఇంతకుముందు చేసిన టెస్ట్ రన్ లో కొంచెం ట్రైనింగ్ అయింది. వీరవేణి గారికి కార్డింగ్ గురించి తెలియదు (మిల్ కార్డింగ్) కానీ, కార్డింగ్ విధానం గురించి తెలుసు. అందుకని వీరవేణి, భువన ఇద్దరికీ కార్డింగ్ గురించి చెప్పి ఆన్ చేయమన్నాను. మొదటిరోజు ఇద్దరూ కార్డింగ్ గురించి తెలుసుకున్నారు. వెంకట లక్ష్మి గారిని వీలైనంత ఎక్కువ సమయం మెషీన్ రన్ చేయండి, ఆ మెషీన్ లో ఏమేమి సమస్యలున్నాయో చూడమన్నాను.

సత్యవేణి గారిని మిగిలిన జనగామ ఆపరేటర్స్ (వనజ, కావ్య, సరిత, మమత)ని తీసుకొని రింగ్ ఫ్రేమ్ లో క్లీనింగ్ చేయవలసినవన్నీ క్లీనింగ్ చేసేటపుడు ఎందుకు, ఎలా అన్నది చెప్తూ, క్లీనింగ్ చేయించమనీ చెప్పాను. సాయంత్రానికి క్లీనింగ్ అయింది. దాంతో జనగామ ఆపరేటర్స్ వెళ్ళిన తర్వాత అంచనాగా 7.30 సమయంలో రింగ్ ఫ్రేమ్ మేము ఆన్ చేశాము.


12-12-25 : మీకు చెప్పిన మెషీన్ ని పులుగుర్త లో ఎలా రన్ చేస్తారో అలా (క్వాలిటీ చెకింగ్, ప్రొడక్షన్ అవర్, వేస్ట్ మేనేజ్ మెంట్, బుక్స్ రాయడం) చేయండని పులుగుర్త ఆపరేటర్స్ కి చెప్పి, దానికి అనుగుమగా జనగామ ఆపరేటర్స్ కి పని చెప్పండన్నాను. ఈరోజు మధ్యాహ్నం వరకు పులుగుర్త వాళ్ళు ఏమి చెపితే అది చేయమని జనగామ ఆపరేటర్స్ కి చెప్పి, మీకింకా ఏమైనా సందేహాలొస్తే మీ బుక్స్ లో రాసుకోండి, లంచ్ బ్రేక్ తర్వాత అవి క్లియర్ చేస్తానని చెప్పాను. మధ్యాహ్నం తర్వాత మెషీన్ జనగామ ఆపరేటర్స్ కి ఇచ్చి, మీరు దగ్గర వుండి చూసుకోమని చెప్పాను. ఆరోజు సాయంత్రానికి జనగామ ఆపరేటర్స్ కి కార్డింగ్, సింప్లెక్స్, రింగ్ ఫ్రేమ్ ఎలా రన్ చేయాలి, రన్ చేస్తున్నపుడు ఏమేమి రాసుకోవాలి, ఏమేమి చెక్ చేసుకోవాలనేది చూపించాను.

 

13-12-25 : కార్డింగ్, సింప్లెక్స్, రింగ్ ఫ్రేమ్ జనగామ ఆపరేటర్స్ కి రన్ చేయడం తెలిసింది కాబట్టి, ఈరోజు డ్రా ఫ్రేమ్ - భువన, సరిత, సింప్లెక్స్ - వనజ, రింగ్ ఫ్రేమ్ - కావ్య, మమతలకు అప్పజెప్పాను. వాళ్ళు ఏదైనా సమస్య వుందని పిలిచినా, సమస్య వుందని మీకు అనిపించినా ఆ మెషీన్ దగ్గరకు వెళ్ళండని, అప్పటివరకు రింగ్ ఫ్రేమ్ లో R.H.S (Right hand side) రన్నింగ్ కు కావలిసిన పనులు చేస్తూ, డ్రా ఫ్రేమ్ లో క్వాలిటీ చెకింగు ఎలా, ఏమిచేయాలో చెప్పండని ఆ పని వారికి అప్పగించాను

Back to blog