ఫీల్డ్ నోట్స్

ఫీల్డ్ నోట్స్

Malkha commons లో ఒక భాగమైన స్పిన్నింగ్ యూనిట్ లో పని చేయడానికి ముందుగా అనుకున్నది పాతవాళ్ళని వద్దని కొత్త వాళ్ళని మాత్రమే తీసుకోవాలని అనుకున్నాము. అందులో కొంత వరకైన చదువుకున్న వాళ్లు, కొంత తక్కువ వయస్సు వాళ్లు, లోకల్ weaver community కి సంబందించిన వాళ్లు, ఆడవాళ్లు మాత్రమే ఉండాలని అనుకున్నాము. ముందుగా కొంతమంది వచ్చి పేర్లు నమోదు చేసుకున్న, ట్రైనింగ్ మొదలైయే సమయానికి అనుకున్న వాళ్లు రాలేదు. తరువాత వచ్చిన వాళ్లలో ఆరుగురిని తీసుకోవడం జరిగింది. మొత్తం మిషిన్ రడీఐన తర్వాత డస్ట్ వస్తుందని ఇద్దరు మానేశారు. మళ్లీ ఇద్దరు కొత్తవాళ్లను తీసుకుంటే అందులో ఒకరు మానేశారు.తర్వాత చాలా మంది వచ్చినా ఇప్పుడు వద్దనుకోని ప్రస్తుతం ఐదుగురుతో స్పిన్నింగ్ యూనిట్ నడిపిస్తున్నాము.

 

Dharmendar
24 december 2025

Back to blog