నాకూ అందరినీ కలుపుకొని పనిచేయడం ఇష్టం. ఇది నా స్వార్థం అనుకోవచ్చు.

నాకూ అందరినీ కలుపుకొని పనిచేయడం ఇష్టం. ఇది నా స్వార్థం అనుకోవచ్చు.

Malkha commons అంటే అర్దమవడానికి నాకూ కూడా చాలా టైమ్ పట్టింది. ఎందుకంటే ఇది ఎలా చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి, ఎందుకోసం చెయ్యాలి, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెపుతూ ఉండేవాళ్లు. ఇలా ఎన్నో సందేహాలు,  ప్రశ్నలు ఎన్నో ఉండేవి. Jangaon చుట్టూ పక్కల organic cotton పండించే farmers, malkha spinning mill, dyeing unit, weavers ఇలా అన్నీ ఒక చోట ఉన్నప్పుడు జనగామ malkha unit ని malkha commons కేంద్రంగా ఎందుకు వాడుకొకూడదు, malkha తో అనుసంధానం ఉన్నవాళ్లు అందరం కలిసి ఎందుకు  పని చేయకూడదు అనుకొని అందరి  ఆలోచనలను కలుపుకుంటు ముందుకు వెళ్లడానికి నిర్ణయించూకోవడం జరిగింది. నాకూ అందరినీ కలుపుకొని పనిచేయడం నాకూ ఇష్టం. ఇది నా స్వార్థం అనుకోవచ్చు.

Malkha Commons అనేది Uzramma  గారి ఆలోచనలు మరింతగా ముందుకు తీసుకొని వెళ్లడానికి ఉపయోగపడుతుందని ఆలోచన, ఇప్పుడున్న మా generation వివిధ రకాల నైపుణ్యం ఉన్నవాళ్ళము మా ఆలోచనలతో అందరం కలిసి ఒక వేదికగా ఎలాంటి ఒత్తిడి  లేకుండా పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ప్రయోగంగా చూడాలనుకున్నాము. అలాగే ఒకే రకమైన ఆలోచనలు ఉన్న అందరం కలుసుకొని, కూర్చొని, వంట చేసుకుంటూ నెలకు ఒక్కసారైన ఒక పని మీద మాట్లాడుకుంటు గడపాలని ఆలోచన, ఇది ఇతరులు విందు పార్టీ చేసుకున్నట్లు అనుకున్న మాకు మాత్రం కలిసి మరింత ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది.  మనది, అందరిది అనుకుంటూ పనిచేయడం. ఒకరికొకరు ఆలోచనలు పంచుకుంటు అందరినీ భాగస్వాములను చేసుకుంటూ ముందుకు వెళ్లాలనుకున్నాము. కొన్ని లక్ష్యాలు ఆలోచనలు చెప్పడానికి రావు, చాలా మందికి అర్థమవడానికి కూడా కొంత సమయం పడుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంగా మారవచ్చు పని జరుగుతూ ఉంటే దాని ఫలితాలు మాట్లాడుతాయి అని నా నమ్మకం.

 

Dharmendra
21 October 2025

Back to blog